Kasipet Mandal News:- (Nov 28)
గ్రామాల్లో నిర్మాణం చేపట్టే డంపింగ్ యార్డులు,
స్మశాన వాటిక నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఎంపీడీవో అలీం సూచించారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఈజీఎస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో డంపింగ్ యార్డ్, స్మశాన వాటిక, ఇంకుడు గుంతలు, నర్సరీలు, ప్లాంటేషన్ తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి అంశంలో నిర్లక్ష్యం చేయకుండా ప్రగతిని సాధించాలన్నారు. మంగళవారం డ్రైడే, శుక్రవారం గ్రీన్ ఫ్రైడే గా గురించి గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని, పారిశుద్ధ్యం, క్లోరినేషన్ తదితర అంశాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీఓ స్వాతి, ఈసీ భీమయ్య, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామ పంచాయతీల కార్యదర్శులు నాగరాజు, ప్రసాద్, ఇసాక్, కవిత, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Source from:- Sakshi News