Kasipet News/Somagudem:- (Nov 17)
ప్లాస్టిక్ రహిత పంచాయతీగా తీర్చిదిద్దేందుకు
ప్రజలు సహకరించాలని సోమగూడెం సర్పంచ్ ప్రమీలా గౌడ్ గ్రామస్తులకు సూచించారు. సోమగూడెంలో ప్లాస్టిక్ వ్యర్ధాలు వేసేందుకు కాలనీలలో శనివారం కంచెలను ఏర్పాటు చేశారు. రీసైక్లింగ్ వీలుగా ఉండే వ్యర్ధాలను ఇందులో వేయాలని ఆమె సూచించారు. అనంతరం స్థానిక మహిళలతో కలిసి మొక్కలకు ట్రీ గార్డులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కలవేణి రాధ, చిలుముల శైలజ, గూడెం పద్మ, ఉమా, బంగారమ్మ, శ్రీనివాస్, ఆరేపల్లి దేవ, సంజీవ్, రంగు గౌతమి, సంధ్య పాల్గొన్నారు.