Kasipet News/ Somagudem:-
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడలకు పెద్దపీట
వేస్తుందని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మండలంలోని సోమగూడెం సరస్వతి మైదానంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మంగళవారం ఉమ్మడి జిల్లా వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలలో మంచి ప్రదర్శన కనబరిచి రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలని కోరారు... జిల్లా స్థాయిలో బాల,బాలికల పోటీలు నిర్వహించడం గర్వకారణమన్నారు. రెండు రోజులపాటు పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మంచి ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను ఖమ్మం లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. సర్పంచులు ప్రమీల గౌడ్, సపాట్ శంకర్, అసోసియేషన్ అధ్యక్షుడు నల్ల శంకర్, శ్రీనివాస్, యాదగిరి, ప్రవీణ్, మల్లయ్య, కన్వీనర్ సిద్దయ్య, జాడి శివ తదితరులు పాల్గొన్నారు.
Source from:- eenadu