Mancherial District News:-
సాంఘిక సంక్షేమ గురుకులాల ఆధ్వర్యంలో
నడుస్తున్న 28 ఇంటర్ కళాశాలలో 2020 - 2021 మొదటి సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా కోఆర్డినేటర్ దామోదర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు దీనికి అర్హులన్నారు. అలాగే ఈ కళాశాలల్లో ప్రవేశం పొందిన వారికి ఎన్.ఐ.టి, నీట్, క్లాట్, సీఎమ్ఏ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ అందిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు tswreis.in వెబ్సైట్ ద్వారా వంద రూపాయలు చెల్లించి డిసెంబర్ 20 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 180042545678 సంప్రదించాలన్నారు.