Kasipet News/Peddanapalli:-
కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ
పంచాయతీ పరిధిలోని పెద్దనపల్లి నాయకపుగూడెం గ్రామంలో సర్పంచ్ వేముల కృష్ణ ఆధ్వర్యంలో వ్యవసాయం శాఖ లోని ఆత్మ వారి సౌజన్యంతో రైతులకు సేంద్రియ ఎరువులతో పంటలు పండించే విధానం పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మండల వ్యవసాయ అధికారిణి వందన మాట్లాడుతూ ప్రభుత్వం, వ్యవసాయశాఖ చేపట్టిన రైతుబంధు, రైతు బీమాను రైతులు ఉపయోగించుకోవాలని,
అలాగే రైతులు పత్తి పంటనే కాకుండా, కందులు, శెనగా, కొర్రలు, లాంటి తిండి పంటలు పండించేందుకు ముందుకు రావాలని ఆమె కోరారు. అలాగే మనం తినే తిండి ప్రమాదకరమైన మందులు వాడి అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నామని తెలిపారు. అందుకే మనం సేంద్రియ ఎరువులతో పంటలు పండించే విధానం నేర్చుకొని ఆర్థికంగా, ఆరోగ్యంగా ఉండాలన్నారు. సేంద్రియ ఎరువులతోనే పంటలు పండించాలని రైతులకు సర్పంచ్, జడ్పీటీసీలతో సేంద్రియ, వ్యర్థమైన, బెల్లం,పదార్థాలతో తయారు చెయువిధానాన్ని రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏడు శ్రీధర్, ఆత్మ అధికారి నిహరిక, ఆదర్శరైతు దాడి పెంటయ్య, రైతులు సోమని రాజం, పల్లె మైసయ్య,భూనేని రాజు, పంది బాపు, పల్లె బాపు రెడ్డి మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

మీ గ్రామంలో జరిగే సంఘటనలు మాకు తెలియజేయండి. మా వాట్సాప్ నెంబర్ 9642474160