Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

అటవీ పనుల అడ్డగింత

Kasipet News/Rottepalli:- (Nov 30)
Kasipet మండలంలోని రొట్టెపల్లి గ్రామ
పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఇటువంటి సమాచారం లేకుండా అటవీ శాఖ అధికారులు బౌండరీలు తవ్వుతుండగా శుక్రవారం ఆదివాసులు అడ్డుకున్నారు. రెవెన్యూ భూమి, అటవీ భూమి అని నిర్ధారణ చేయకుండా అధికారులు తవ్వుతున్నారని, కనీసం తమ పశువులు మేతకు వెళ్లేందుకు వదిలి పెట్టడం లేదని పనులు అడ్డుకున్నారు. దీంతో అటవీ శాఖ ఎఫ్.ఎస్.వో  ప్రభాకర్ మ్యాప్ తీసుకువచ్చి అటవీ భూమి అని చెప్పడంతో పాటు విఆర్వో ఈశ్వర్ నిర్ధారించారు. పశువులకు దారికోసం ఆదివాసిలు పట్టుబడడంతో అందుకు అధికారులు అంగీకరించడంతో సమస్య సద్దుమణిగింది. అటవీ అధికారులు ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపించారు.

Source from:- Sakshi 


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App