Kasipet Mandal News:-
కాసిపేట - 1 బొగ్గుగనిలో నాణ్యత వారోత్సవాలు
ప్రారంభమయ్యాయి. గని మేనేజర్ భూ శంకరయ్య గురువారం జెండాను ఎగురవేసి వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్పత్తి చేసిన బొగ్గులో కలప, రాయి లాంటివి ఉండకుండా చూడాలన్నారు. వారం రోజుల పాటు వారోత్సవాలు జరగనున్నాయి. ఈ వారోత్సవాలలో భాగంగా కార్మికులకు క్విజ్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కొనుగోలుదారునికి నాణ్యమైన బొగ్గుని అందించాలనే లక్ష్యంతో సింగరేణిలో ప్రతి సంవత్సరం వారం రోజుల పాటు వారోత్సవాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ భూ శంకరయ్య, ఉప మేనేజర్ అల్లావుద్దీన్, కార్మిక నాయకులు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

![]() |
కార్మికులనుద్దేశించి మాట్లాడుతున్న ఉప మేనేజర్ |