Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మండలంలో ఘనంగా కొక్కిరాల సురేఖ గారి జన్మదిన వేడుకలు

Kasipet Mandal News:-
Kasipet మండలం Devapur లోని సాయి
బాబా దేవాలయములో శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు  శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ గారి జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదట కేక్ కట్ చేసి తరువాత అన్నదాన కార్యక్రమం చేసారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సర్పంచ్ వేముల కృష్ణ గారు  మాట్లాడుతూ పేద ప్రజల ఆశ జ్యోతి శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ గారి జన్మదిన వేడుకలు ఆలయంలో భక్తులు, కార్యకర్తల మధ్య చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. సమాజ సేవలో నిరంతరం అలిసిపోకుండా సేవాకార్యక్రమాలు చేస్తున్న సురేఖమ్మ గారు నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం మాజి ఉపాధ్యక్షుడు మెరుగు శంకర్, కూకట్ల దేవేందర్, ఇస్మాయిల్, గాదం గట్టయ్య, NSUI నాయకులు పన్నాల మహేష్, మండల ఉపాధ్యక్షుడు వంశి నాయకులు పాల్గొన్నారు.

 కేక్ కట్ చేస్తున్న నాయకులు


 అన్నదాన కార్యక్రమం





Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App