Kasipet Mandal News/Somagudem:-(Nov 8)
సోమగూడెం గ్రామపంచాయతీ సమీపంలో పెరిగిన
పిచ్చి మొక్కలను సర్పంచ్ ప్రమీల గౌడ్ ఆధ్వర్యంలో ప్రజలు గురువారం శ్రమదానంతో తొలగించారు. పారిశుద్ధ్య పనులలో భాగంగా చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ చెప్పారు. ఇంటి పరిసరాల్లో పిచ్చి మొక్కలు తొలగించి పండ్లు, పూల మొక్కలను నాటుకోవాలని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని సూచించారు. దీంతో పాటు గ్రామంలో సేకరించిన ప్లాస్టిక్ చెత్తను తరలించారు. గ్రామ మహిళలు, సిబ్బంది పాల్గొన్నారు.
Source From:- Namasthe Telangana