Kasipet Mandal News:- (Nov 4)
అకాల వర్షాల కారణంగా పత్తి రైతుల ఆశలపై నీళ్లు
చల్లినట్లు అయ్యింది. సాగు ప్రారంభంలో వర్షాలు సక్రమంగా కురవక ఒక్కో రైతు రెండు మూడు సార్లు పత్తి విత్తనాలు నాటాల్సి వచ్చింది. ప్రస్తుతం పత్తి పంట చేతికి వచ్చే సమయంలో వరుసగా కురుస్తున్న వర్షాలకు పత్తి కాయలు మొత్తం పాడై పోతున్నాయి. ఈ కాయల నుండి దూది సక్రమంగా వచ్చే పరిస్థితి లేదు. పత్తి కాయల్లో నీళ్లు చేరి కాయలు రంగు మారాయి. కొందరి చేనుల్లో పత్తి కాయల నుండి మొలకలు బయటకు వస్తున్నాయి. కొద్దిపాటి గా తీసిన పత్తిని అన్నదాతలు రోడ్డుపై ఆరబెడుతున్నారు. తడిగా ఉన్న పత్తిని వ్యాపారులు కొనుగోలు చేసే అవకాశం లేదని, తడిసి పాడైపోయిన కాయల్లో నుంచి పత్తిని తీసి ఆరబెట్టేందుకు నానా తంటాలు పడుతున్నారు.
Source from:- eenadu
మీ గ్రామంలో జరిగే సంఘటనలను మాకు తెలియజేయండి. మా వాట్సాప్ నెంబర్:- 9642474160