Kasipet News/Komatichenu:-(Nov 30)
గ్రామాల్లో సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి
తీసుకురావాలని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని Kasipet ఎస్ఐ రాములు తెలిపారు. శుక్రవారం మండలంలోని Komatichenu గ్రామంలో గ్రామస్తులతో గ్రామసభ నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు ఉన్నది ప్రజల కోసమేనని, శాంతి భద్రతలు కాపాడడం లక్ష్యంగా పని చేయనున్నట్లు పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడినట్లయితే వెంటనే పోలీసులను సంప్రదించాలన్నారు. స్థానిక సమస్యలు, ఇతర అంశాలపై గ్రామ పోలీసు అధికారులతో చర్చించాలన్నారు. యువత చెడు వ్యసనాల వైపు మళ్లకుండా చదువు, క్రీడలతో ముందుకు సాగాలన్నారు.
Source from:- sakshi

దుప్పట్లు పంపిణీ:-
ఈ సందర్భంగా గ్రామంలోని పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఫ్రెండ్లీ పోలీసును సద్వినియోగం తీసుకుంటూ శాంతిభద్రతలు కాపాడటంలో ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రామటెంకి శ్రీనివాస్, ఎంపీటీసీ చంద్రమౌళి, వీపిఓ ధరంపాల్, స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.Source from:- sakshi