Kasipet Mandal News:-
శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో ఆవిష్కరణలు దేశ
భవిష్యత్తుకు మార్గదర్శిలా ఉపయుక్తం అవుతాయని విద్యార్థులు సమాజానికి ఉపయోగకరమైన నూతన ఆవిష్కరణలను తయారుచేయాలని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ నాగమల్లయ్య అన్నారు. Kasipet మండలంలోని మోడల్ స్కూల్లో సోమవారం వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులు తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పిన బోధనలను అర్థం చేసుకుంటూ నూతన ప్రయోగాలను తయారుచేసి సఫలీకృతులు కావాలని ఆయన సూచించారు. విద్యార్థులు తయారుచేసిన వర్షపు నీరు ఆదా, కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, మురుగునీరు శుద్ధికరణ, ప్రభుత్వ భవనం నమూనాలు ఆకట్టుకున్నాయి.
Source from:- eenadu