Kasipet Mandal News:- (Nov 21)
భూగర్భ గనుల నుండి తీసిన బొగ్గు నాణ్యమైనదని
విపణిలో ముద్ర పడితేనే కార్మికుల శ్రమకు ఫలితం దక్కుతుందని కాసిపేట-1 మేనేజర్ భూశంకరయ్య అన్నారు. బుధవారం గని ఆవరణలో జరిగిన బొగ్గు నాణ్యత ఉత్సవాల ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఉత్పత్తి చేసిన బొగ్గులో వ్యర్ధాలు లేకుండా చూడాలని కార్మికులకు, పర్యవేక్షకులకు సూచించారు. అనంతరం క్విజ్ పోటీలు నిర్వహించగా ప్రథమ బహుమతి జనార్దన్, ద్వితీయ బహుమతి డి నర్సయ్య, తృతీయ బహుమతి నిఖిల్ అందుకున్నారు. కార్యక్రమంలో ఉప మేనేజర్ అల్లావుద్దీన్, నిఖిల్, సేఫ్టీ ఆఫీసర్ సునీల్, తదితరులు పాల్గొన్నారు.
Source from:- eenadu