Kasipet Mandal News/ Malkepalli:- (Nov 6)
Kasipet మండలంలోని మల్కెపల్లి, పెద్దనపల్లి,
ధర్మారావుపేట గ్రామ శివారులోని ఇటీవల కురిసిన వర్షానికి నష్టపోయిన వరి పంటను ఏఈవోలు తిరుపతి, శ్రీధర్ మంగళవారం సర్వే చేశారు. వర్షానికి పడిపోయిన వారి పంటల నష్టాన్ని క్షేత్రస్థాయిలో కి వెళ్లి పరిశీలించడం జరిగిందని, నష్టాన్ని ఉన్నతాధికారులకు అందించనున్నట్లు తెలిపారు.
Source from :- Sakshi

సుడి దోమ ఉధృతి:-
మండలంలోని పెద్దనపల్లి మల్కెపల్లి శివారులో వరి పంటలో సుడి దోమ ఉధృతి ఉన్నట్లు గుర్తించడం జరిగిందని ఏఈవోలు తిరుపతి, శ్రీధర్ తెలిపారు. పొలంలో సుడిదోమ ఉన్నట్లయితే గమనించి వెంటనే సమాచారం అందించాలన్నారు. ఆలస్యం చేసినట్లయితే 48 గంటల్లో పొలం అంతా వ్యాపించి అదుపు చేయడం కష్టమవుతుందని ముందస్తుగా సలహాలు పాటిస్తే పంట నష్టం కాకుండా రైతులు కాపాడుకోవచ్చన్నారు. సుడి దోమ నివారణకు రైతులు ఉదయంవేళ పొలంలో కింది దుబ్బుల దగ్గర ఉంటే గమనించి వెంటనే మడిలో నుండి నీటిని తీసివేసి పాయలుగా చేసుకోవాలన్నారు. రసాయనిక మందులైన డైనోక్లూరెన్ 20 శాతం 80 గ్రాములు ఎకరాకు లేదా పైమెట్రోజన్ 50 శాతం 120 గ్రాములు ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి సాయంత్రం వేళల్లో పిచికారీ చేసుకున్నట్లయితే ఉధృతిని తగ్గించుకోవచ్చన్నారు.Source from :- Sakshi