Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

గ్రామసభలను వినియోగించుకోవాలి

Kasipet Mandal News/మద్దిమడ:- (Nov 2)
 Kasipet మండల ప్రజలు ఉపాధి హామీ గ్రామ సభలను
సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో అలీం సూచించారు. మండలంలోని మద్దిమడ గ్రామ పంచాయితీలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉపాధి హామీ పనులపై శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. సంవత్సరంలో చేపట్టే పనుల గురించి రైతుల నుండి వినతులు స్వీకరించారు. గ్రామంలో ఉపాధి హామీ ద్వారా కేటాయించే పనులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మండలంలోని సోమగూడెం (కే ) గ్రామ పంచాయతీలో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు. ఎంపీపీ రొడ్డ లక్ష్మి, సర్పంచులు జంగు, సపాట్  శంకర్, జేఏ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Source from :- eenadu

 మీ గ్రామంలో జరిగే సంఘటనలు మాకు తెలియజేయండి. మా వాట్సాప్ నెంబర్:- 9642474160
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App