Kasipet Mandal News:-
కార్తీక పౌర్ణమి సందర్భంగా కాసిపేట మండలంలోని
దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుండే ఆలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ మహిళలు కార్తీక దీపాలు వెలిగించడంతో దేవాలయాలు కనులవిందుగా మారాయి. భక్తఆంజనేయ స్వామి వారి ఆలయంలో సర్పంచ్ ప్రమీలాగౌడ్ గారి ఆధ్వర్యంలో దీపోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రమీలాగౌడ్, ఎంపీటీసీ లక్ష్మి, ఎస్ఐ రాములు, రవితేజ, స్థానిక మహిళలు పాల్గొన్నారు.