Kasipet Mandal News:-
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు... అని మళ్లీ
జనం నోట వినిపిస్తోంది. కొందరు ప్రభుత్వ ఆస్పత్రిలోని కిందిస్థాయి సిబ్బంది వ్యవహరిస్తున్న తీరిది. ప్రభుత్వ వైద్యులు పరీక్షలు చేసిన అనంతరం ఒక రోగికి రాసి ఇచ్చిన మందులు కౌంటర్లో ఉచితంగా ఇవ్వాల్సి ఉండగా అందులోని సిబ్బంది అలా చేయకుండా ఫలానా దుకాణానికి వెళ్లి ఈ మందులను కొనుక్కోండి అని సూచించడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది. వివరాల్లోకి వెళితే మండలంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఈశ్వరి అనే మహిళకు సోమవారం వైద్యులు వైద్య పరీక్షలు చేసి మందులు రాసి ఇచ్చారు. కౌంటర్ దగ్గరికి వెళ్లి మందుల చీటీ అందజేసింది. ఈ మందులు లేవని బయట సంబంధించిన మెడికల్ దుకాణానికి వెళ్లాలని సూచించారు అక్కడి సిబ్బంది. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారంతా రెక్కాడితే గాని డొక్కాడని పేదలే. ఈ విషయమై డాక్టర్ ఝాన్సీని వివరణ కోరగా తాను రాసిన మందులు ఇక్కడ ఉన్నాయని మరి సంబంధించిన వారు ఎందుకు ఇవ్వలేదో తనకు తెలియదని చెప్పారు. మందులు ఉన్నా కూడా సిబ్బంది తమకు తెలిసిన ప్రైవేటు మందుల దుకాణాలకు పంపిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలని బాధితులు కోరుతున్నారు.
Source from:- eenadu