Kasipet Mandal News:- (Nov 8)
సీజనల్ గా వచ్చే వ్యాధులపై విద్యార్థులు
అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు ఝాన్సీ అన్నారు. గురువారం కాసిపేట మండలం లోని కస్తూర్బా గాంధీ విద్యాలయం, రేగులగూడెం లోని ఆశ్రమ పాఠశాలల్లో ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులను పరీక్షించి అవసరం ఉన్న వారికి మందులు అందించారు. అనంతరం ఆమె సీజనల్ గా వచ్చే వ్యాధుల పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. రోగాలు దరిచేరకుండా ఉండాలంటే విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత తో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సహాయకులు సునీత, నారాయణ, ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
Source from :- jyothy