Kasipet Mandal News/Kasipet:-(Nov7)
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పే
ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులే వారు ఉండే ఆసుపత్రిలో ఎక్కడ పడితే అక్కడే నీరు నిలిచి ఉంటే గమనించే వారే కరువయ్యారు. ఇలాంటి దుస్థితి మండలంలోని kasipet ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంది. మండలంలోని 30 వేల జనాభాకు ఏకైక ప్రభుత్వ ఆసుపత్రి ఇది. రోజు సుమారు వందమందికి పైగా వస్తుంటారు. ప్రతి బుధవారం గర్భిణీలు వస్తూపోతూ ఉంటారు. శుభ్రంగా ఉండాల్సిన ఆస్పత్రిలో ఎక్కడపడితే అక్కడే నీరు నిలిచి ఉండటంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. వచ్చిన రోగాని కంటే ఇక్కడికి వస్తే మరిన్ని రోగాలు వస్తున్నాయి అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో మరుగుదొడ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని మహిళలు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.
Source From:- Eenadu