Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

స్మశాన వాటిక స్థలంపై గ్రామస్తుల రగడ

Kasipet News:- (Nov 30)
Kasipet లో  ఊరి పక్కనే స్మశాన వాటిక నిర్మాణ
పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇటీవల ఈ పనులను అడ్డుకోవడంతో పనులు నిలిపివేశారు. ఇప్పటి వరకు బాగానే ఉన్నా మళ్ళీ అధికారులు శుక్రవారం అదే ప్రాంతంలో నిర్మాణ పనుల కోసం సర్వే ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎన్ని సార్లు చెప్పిన ప్రజాప్రతినిధులు, అధికారులు తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతాల్లో పనులు చేపడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని గ్రామస్తులు చెప్పడంతో అధికారులు అక్కడి నుండి వెళ్ళిపోయారు.

Source from:- eenadu 


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App