Kasipet Mandal News:- (Nov 7)
అధికారులు మామూళ్ల మత్తులో ఊగినoత కాలం
కాంట్రాక్టర్లు నాణ్యత పట్టించుకోరని తెలపడానికి నిదర్శనంగా మారింది అంగన్వాడీ వ్యవస్థ. Kasipet మండల కేంద్రంలో గర్భిణులకు పంపిణీ చేసిన పప్పు పూర్తిగా పురుగులు పట్టి, పుచ్చిపోయి ఉండడం పట్ల స్థానిక అధికార పార్టీ ఎంపిటిసి నిర్వాహకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంగన్వాడి కేంద్రాలలో కుళ్లిపోయిన కోడిగుడ్డు, చెడిపోయిన పాలు, పురుగులు పట్టిన పప్పులు పంపిణీ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో స్వయాన Kasipet ఎంపీటీసీ అక్కెపల్లి లక్ష్మి ఇంటికి గర్భిణి అయిన తన కోడలు కోసం వచ్చిన కందిపప్పు చూసి అవాక్కయింది. గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారులకు పౌష్టికాహారం ఇస్తున్నామని చెప్పి ఇచ్చేది ఇదేనా? ఇది పౌష్టికాహారమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఐసిడిఎస్ అధికారులు, అంగన్వాడీల తీరుపై ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. పురుగులు పట్టిన పప్పు విషయంపై ఎంపీడీవో సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అంగన్వాడి ద్వారా అందించే ఆహారం తీసుకుంటే అనారోగ్యానికి గురికావాల్సి వస్తుందని, ప్రభుత్వం మంచి ఉద్దేశంతో పెడితే అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై పేదలకు అన్యాయం చేస్తున్నారని, వెంటనే నాణ్యమైన సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సరుకుల రవాణాలో అలసత్వం ప్రదర్శించి గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలకు నాణ్యమైన సరుకులు అందించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోయారు. లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించే విషయంలో రాజీపడకుండా ఉండాలన్నారు. పురుగులు పట్టిన పప్పులు తింటే అనారోగ్యానికి గురి కావడం ఖాయమన్నారు. ఇలాంటి తప్పులు జరగకుండా చూడాల్సిన బాధ్యత అంగన్వాడీలదే అన్నారు. ఉన్నతాధికారులు దృష్టి సారించి లబ్ధిదారులకు అందించే సరుకులపై పర్యవేక్షణ చేయాలన్నారు.
Source from:- Sakshi