kasipet Mandal News:- (Nov 9)
ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, గ్రామాలలో ప్రధాన
కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్ఐ రాములు సూచించారు. లంబాడి తండా (కె) గ్రామస్తులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. సీసీ కెమెరాలతో నేరా పరిశోధన సులభతరమవుతుందన్నారు. గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం జడ్పీ సెకండరీ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. చదువుపై శ్రద్ధ పెడితే ఉన్నతంగా ఎదుగుతారని సూచించారు. ప్రైమరీ పాఠశాలను సందర్శించిన ఎస్ఐ తో ఉపాధ్యాయులు మాట్లాడారు. పాఠశాల పరిసరాల్లో తాగుబోతులు వీరంగం సృష్టిస్తున్నారని, మద్యం సీసాలను బడి ఆవరణలో పగలగొడుతున్నారని వివరించారు. గస్తీని పెంచి పరిష్కరిస్తామని హామీ ఎస్ఐ గారు ఇచ్చారు. లంబాడి తండా (కె) జిపిని పరిశీలించి సర్పంచ్ భానోత్ వినోదను గ్రామంలోని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏఎస్ఐ శంకరయ్య, బానోత్ రాజేష్, కార్యదర్శి సురేష్, జైపాల్ ఉన్నారు.
source from:- Namasthe telangana