Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ఘనంగా దుర్గామాత పూజలు

Kasipet Mandal News:- (Nov 29)
మందమర్రి ఏరియా kasipet గనిపై గురువారం
ఆలయ వారోత్సవాలను పురస్కరించుకొని దుర్గామాత పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నిర్వహించే ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి హాజరయ్యారు. కార్మిక కుటుంబాలు, సమీప గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావడంతో గని ఆవరణలో పండగ వాతావరణం నెలకొంది. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జెడ్పి చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి ని గని అధికారులు, టీబీజీకేఎస్ నాయకులు, టిఆర్ఎస్ నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో జిఎం రమేష్ రావు, ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్, ఎంపీపీ రొడ్డ లక్ష్మి, జడ్పిటిసి పల్లె చంద్రయ్య, మాజీ జెడ్పిటిసి రౌతు సత్తయ్య, యూనియన్ ల నాయకులు దాగం మల్లేష్, బియ్యాల వెంకటస్వామి, లక్ష్మీనారాయణ, ఓడ్నల రాజన్న, మేడ సమ్మయ్య, దుగుట శ్రీనివాస్, అధికారులు, కార్మిక కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


 సందడిగా మారిన గని ఆవరణ 

Source From:- Sakshi
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App