Kasipet Mandal News:-
టీబిజీకేఎస్ తోనే సింగరేణి కార్మికుల హక్కులు
సాదించబడతాయని టీబిజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలిపారు. మంగళవారం మందమరి ఏరియా కాసిపేట గనిలో ఏర్పాటుచేసిన మీటింగ్ లో వీరు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కృషితోనే కారుణ్యనియామకాలు సాధ్యమయ్యాయని, కారుణ్య నియామకాలకు అన్ని రకాలుగా అడ్డంకులు కల్పించినా జాతీయ సంఘాలు నేడు విమర్శలు చేస్తున్నాయన్నారు. జాతీయ సంఘాలు హక్కులు పోగొట్టడం తప్పితే సాధించింది ఏమీ లేదని ఆరోపించారు. టీబిజీకేఎస్ కార్మికులకు అనేక హక్కులు కల్పించిందన్నారు. డిస్మిస్ కార్మికులకు ఉద్యోగ అవకాశం కల్పించడంతో పాటు అంబేద్కర్ జయంతికి సింగరేణిలో సెలవు ప్రకటించిందన్నారు. టీబిజీకేఎస్ లో చేరిన కార్మికులకు కండువాలు కప్పి యూనియన్ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీబిజీకేఎస్ ఏరియా అధ్యక్షుడు సంపత్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, సత్యనారాయణ, సూర్యనారాయణ, దుగుట శ్రీనివాస్, ఒడ్నాల రాజన్న, సోమయ్య, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Source from:- sakshi