Kasipet Mandal News:- (Nov 6)
పరిసరాలను శుభ్రంగా ఉంచడం వల్ల వ్యాధులు
నుండి కాపాడుకునేందుకు అవకాశం ఉంటుందని మండలంలోని ప్రత్యేక అధికారులు, సర్పంచులు అన్నారు. మండలంలోని పలు పంచాయతీలో మంగళవారం ప్రత్యేక అధికారులు, సర్పంచులు డ్రైడే నిర్వహించారు. ప్రత్యేక అధికారులు మాట్లాడుతూ... పరిసర ప్రాంతాల్లో నీటిని నిల్వ ఉంచడం వల్ల దోమలు పెరిగి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని సూచించారు. మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. వీధుల్లో ఇంటి పరిసర ప్రాంతాల్లో టైర్లు, నీటి గుంటలు, కాళీ కొబ్బరి బోండాలు, నిరుపయోగంగా ఉన్న డ్రమ్ములో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. మురుగు నీరు నిలిచిన ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. సర్పంచులు పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Source From:- Eenadu