Kasipet News/Devapur:-
కాసిపేట మండలం దేవపూర్ గ్రామ పంచాయతీ
పరిధి పెద్దాపూర్ కు చెందిన కడప శివప్రసాద్(6) అనే గిరిజన బాలుడు బుధవారం జ్వరంతో ఇంట్లో మృతిచెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.... శివప్రసాద్ రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. స్థానికంగా ప్రైవేటు వైద్యులతో వైద్యం చేయించినా తగ్గలేదు. వ్యవసాయ కూలీలుగా కాలం వెల్లదీస్తున్న తల్లిదండ్రులు కౌసల్య - శంకర్ లకు పూట గడవడమే కష్టంగా మారింది. ప్రైవేటు ఆస్పత్రిలో చూపించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఇంట్లోనే ఉంచారు. మంగళవారం రాత్రి అపస్మారక స్థితిలోకి వెళ్లి బుధవారం ఉదయం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వైద్య సిబ్బంది గిరిజన గ్రామాల్లో పర్యటించి వైద్య శిబిరాలు నిర్వహించాలని గిరిజన సంఘాల నాయకులు కోరుతున్నారు.
Source from :- Andhra Jyothy