Kasipet Mandal News:- (Nov 17)
సహకార సంఘం సేవలు విస్తరించడానికి తాము
సహకరిస్తామని, సభ్యులు సహకరించి సద్వినియోగం చేసుకోవడంతో పాటు సంఘాల్లో సభ్యుల సంఖ్య పెంచాలని జిల్లా సహకార సంఘం అధికారి సంజీవరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ తెలిపారు. 42 లక్షల రూపాయలతో త్వరలో సహకార సంఘం భవన నిర్మాణం చేపడతామన్నారు. దేవాపూర్, మల్కెపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి మహాజన సభ నిర్వహిస్తామని రైతులందరూ హాజరు కావాలని సూచించారు. శనివారం మండల కేంద్రంలోని ధర్మారావు పేట సహకార సంఘం కార్యాలయం ఆవరణలో సహకార సంఘం 66వ వారోత్సవాలలో భాగంగా సమావేశం నిర్వహించారు. కార్యక్రమం లో వ్యవసాయ శాఖ ఏడిఏ సురేఖ, ఏవో వందన, జడ్పిటిసి పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రం రావు, ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, కో-ఆపరేటివ్ బ్యాంక్ డీజీఎం భాస్కర్ రెడ్డి, ఏజీఎం వెంకటేశ్వరస్వామి, మేనేజర్ రాజు, ఏఈవోలు తిరుపతి, శ్రీధర్ తదితరులు ఉన్నారు.