Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కేజీబీవీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

Kasipet Mandal News:- (Nov 10)
కేజీబీవీ ఉద్యోగుల సమస్యలు వెంటనే
పరిష్కరించాలని టి.ఎస్.యు.టి.ఎఫ్ ఆధ్వర్యంలో కేజీబీవీ ఉద్యోగులు శనివారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టి.ఎస్.యు.టి.ఎఫ్ జిల్లా కోశాధికారి, మండల అధ్యక్షుడు రాథోడ్ దిలీప్ మాట్లాడుతూ కేజీబీవీ, యుఆర్ఎస్ సమస్యల పరిష్కారానికి టి.ఎస్.యు.టి.ఎఫ్ ఆధ్వర్యంలో దశల వారీ పోరాట కార్యక్రమాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై భోజన విరామ సమయంలో నిరసన తెలపడం జరిగిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. హెల్త్ కార్డు మంజూరు, సర్వీస్ రెగ్యులరైజ్ చేయాలని, 10వ పిఆర్సి ప్రకారం వేతనాలు చెల్లించాలన్నారు. వార్డెన్ పోస్టులు మంజూరు చేయాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల సెలవులను వర్తింపచేయాలని అప్పటివరకు నిరసనలు, ఆందోళనలు ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేక అధికారి సరిత, ఉపాధ్యాయులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. 

Source from:- Sakshi


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App