Mancherial News:-
జిల్లాలోని 18 కస్తూర్బా విద్యాలయాల్లో ఖాళీగా
ఉన్న ఏఎన్ఎం, ఎకౌంటెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఏఎన్ఎం పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉండి ప్రభుత్వం గుర్తింపు పొందిన విద్యాలయం నుండి శిక్షణ పొంది ఉండాలన్నారు.
అకౌంటెంట్ పోస్టులకు డిగ్రీలో కామర్స్ విభాగం చదివి ఉండి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని, లేదా బీకాం కంప్యూటర్స్ పూర్తిచేసి ఉండాలని ఆయన తెలిపారు. ఈ నెల 22 నుండి 26 వరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర విద్యాశాఖ నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రియ ఉంటుందని డీఈవో పేర్కొన్నారు.
Source from:- Eenadu