Kasipet Mandal News/ Devapur:-
Kasipet మండలంలోని Devapur ఓరియంట్
సిమెంట్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ అవగాహన సదస్సు ఆదివారంతో ముగిసింది. దేవాపూర్ లేడీస్ క్లబ్ ఆవరణలో ఐదు రోజుల పాటు నిర్వహించిన అవగాహన సదస్సులో టీచర్ రమణ ప్రసాద్ మాట్లాడుతూ యాంత్రికజీవితంలో పుట్టి పెరిగి ప్రతి వ్యక్తి మానసిక వేదనకు గురవుతున్నాడన్నారు. ప్రశాంత జీవితం గడిపే విధానాన్ని మరిచి తీవ్ర సమస్యలతో పాటు రోగాలను కొనితెచ్చుకుంటున్నారని తెలిపారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా మానసిక ఒత్తిడిని సుదర్శన క్రియ ద్వారా జయించవచ్చన్నారు. దీనికి సంబంధించి ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో మానసిక ఒత్తిడిని జయించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సుదర్శన క్రియను నిరంతరం కొనసాగించాలన్నారు. ముగింపు కార్యక్రమంలో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కంపెనీ అధ్యక్షుడు ఎస్.కె పాండే, యూనియన్ హెడ్ ఆర్.వి.ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Source from:- Andhra jyothy