Kasipet Mandal News:- (Nov 16)
మండలంలోని కాసిపేట, ముత్యంపల్లి, పెద్దనపల్లి,
సోమగూడెం, సోనాపూర్, మద్దిమాడ, మామిడిగూడ, రొట్టపల్లి తదితర గ్రామాలలో శుక్రవారం గ్రీన్ ఫ్రైడే లో భాగంగా గ్రామ పంచాయతీలలో రోడ్డు పక్కన నాటిన మొక్కలకు నీరు పోశారు. గ్రామాల్లో, కార్యాలయ ఆవరణలో నాటిన మొక్కలకు సైతం పంచాయతీ సిబ్బంది, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో నీరు పోశారు. గ్రామంలోని, మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ ఎంఏ అలీం మాట్లాడుతూ మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమన్నారు. వాతావరణ సమతుల్యం దెబ్బతినకుండా కాపాడతాయన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Source From:- Sakshi