Kasipet Mandal News:-
Kasipet మండల కేంద్రంలోని సర్కారు మందులు
కాలం చెల్లకుండానే చెత్తకుప్పలకు చేరుతున్నాయి. మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలోని విలువైన మందులను రోగులకు ఇవ్వకుండా చివరకు చెత్తకుప్పలు పాలు చేస్తున్నారు. శుక్రవారం ఆస్పత్రి ఆవరణలోని ప్రహరీ పక్కన మందులు చెత్తకుప్పల్లో దర్శనమిచ్చాయి. గతంలో కాలం చెల్లిన మందులను పడేయగా ప్రస్తుతం గడువు ఉన్న మందులను సైతం పడేయడం సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనం. జ్వరానికి ఉపయోగించే ముందు ఎక్స్పైరీ తేదీ 2019 డిసెంబర్ వరకు ఉన్న చెత్తకుప్పల్లో పడేయడం ఏమిటని పలువురు పేర్కొంటున్నారు. మందులను బాధితులకు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయమై మెడికల్ ఆఫీసర్ బాలాజీని వివరణ కోరగా మందులను బయట పడవేసిన విషయం నా దృష్టికి రాలేదని, దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Source From:- Andhra Jyothy
ఈ వార్త ఆంధ్ర జ్యోతి పత్రిక నుండి తీసుకున్నది.