Kasipet Mandal News:-
లయన్స్ క్లబ్ ఆఫ్ సోమగూడెం వారు నవంబర్ 14
మధుమేహ వ్యాధి నివారణ దినోత్సవం పురస్కరించుకొని శనివారం రోజు కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు గొంది వెంకటరమణ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ వారు నవంబర్ నెలను నివారణ మరియు వ్యాధి నిర్ధారణ కోసం ప్రత్యేకంగా ప్రకటించడం జరిగిందన్నారు. దీనికి లయన్స్ క్లబ్ ఆఫ్ సోమగూడెం ఆధ్వర్యంలో నవంబర్ 14 నుండి 19వ తేదీ వరకు మండలంలోని వివిధ ప్రాంతాలలో మధుమేహ వ్యాధి నివారణ కోసం ప్రజలకు అవగాహన కల్పించడానికి, వ్యాధిని నిర్ధారించడానికి ఉచిత క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. మండలంలోని ప్రజలందరూ వీటిని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి వేముల కృష్ణ, కోశాధికారి దూడం మహేష్, క్లబ్ ఉపాధ్యక్షుడు సిద్దం తిరుపతి, క్లబ్ సభ్యుల మేడ సమ్మయ్య, కూకట్ల దేవేందర్ లు పాల్గొన్నారు.
క్యాంపు నిర్వహించే తేదీలు, ప్రాంతాలు:-
తేదీ 14 నాడు సోమగూడెం, పెద్దనపల్లి
తేదీ 15 నాడు కాసిపేట, ముత్యంపల్లి
తేదీ 16 నాడు ధర్మ రావు పేట, మల్కేపల్లి
తేదీ 17 నాడు లక్ష్మీపూర్, వెంకటాపూర్
తేదీ 18 నాడు సోనాపూర్ , గట్రావుపల్లి
తేదీ 19 నాడు దేవాపూర్, మద్దిమాడ

![]() |
కరపత్రాలను విడుదల చేస్తున్న క్లబ్ సభ్యులు |