Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మహిళలకు కుట్టు మిషన్ల పంపిణి

Kasipet News/Devapur:- (Nov 23)
కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామంలో
శుక్రవారం ఔట్ రిచ్ మ్యాప్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. మండలంలో మూడు కేంద్రాలలో 31 మందికి కుట్టుమిషన్లు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. తమ సంస్థ ఆధ్వర్యంలో చేతి పంపుల ఏర్పాటుతో పాటు మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు కుట్టు శిక్షణ ఇప్పించి కుట్టు మిషన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఔట్ రిచ్ మ్యాప్ డైరెక్టర్ పాల్విగ్, ఎంపీపీ రోడ్డ లక్ష్మి, సంస్థ కార్యదర్శి కరోలిన్ వింగ్, కోఆర్డినేటర్ సునీల్ కుమార్, కన్వీనర్ రత్నం విజయ్ కుమార్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. 

Source from :- Sakshi
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App