Kasipet Mandal News:- (Nov 28)
Kasipet మండలంలోని లంబాడి తండ,
చొప్పరిపల్లి పాఠశాలకు కల్వరి మినిస్ట్రీస్ ప్రవీణ్ ఫౌండేషన్ వారిచే సీలింగ్ ఫ్యాన్ మరియు విద్యార్థులకు స్వెటర్లు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ సిస్టర్ షారూన్, ప్రవీణ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మంచి ప్రశాంత వాతావరణంలో చదువును అభ్యసించాలన్న ఉద్దేశంతో సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. లంబాడి తండ పాఠశాలకు సీలింగ్ ఫ్యాన్, చొప్పరిపల్లి, లంబాడి తండ పాఠశాల విద్యార్థులకు చలి నుండి రక్షణ పొందేందుకు స్వెటర్లు అందజేసినట్లు వారు పేర్కొన్నారు. భవిష్యత్తులో సైతం విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు ప్రమీల గౌడ్, శంకర్, వినోద, ఎంపీటీసీలు రాంచందర్, మల్లమ్మ, పాఠశాల హెచ్ఎంలు లచ్చయ్య, వాణి కుమారి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Source From:- Andhra Prabha