Kasipet News/Regulaguda:-
Kasipet మండలం రేగులగూడలో ఆదివారం
ఆదివాసీ పర్ధాన్ పురోహిత్ సేవ సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కుర్సెంగా సోనెరావు మాట్లాడుతూ డిసెంబర్ 9 న ఢిల్లీ లో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు ఆదివాసీల ఉద్యమం కొనసాగుతుందన్నారు. గౌరవ ఎంపీ సోయం బాపురావు గారి పిలుపు మేరకు గ్రామాల నుండి ఆదివాసిలు అధిక సంఖ్య లో ఢిల్లీ వెళ్లనున్నట్టు నాయకులు పేర్కొన్నారు. దీనికి గాను ముందుగానే రైలు టికెట్స్ రిజర్వేషన్ చేస్తున్నట్టు సంఘ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాపూర్, చింతగుడా, మల్కేపల్లి ,రేగులగూడ గ్రామల నుండి దాదాపు రెండు వందల మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అర్క కృష్ణ, కోశాధికారి గేడం శేఖర్ , రాయి సెంటర్ మండల ఉపాధ్యక్షుడు కొడప అనంత రావు, మడావి వెంకటేష్, కొడప శ్యామ్ సుందర్, గేడం విజయ్ కుమార్ గ్రామ పటేళ్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.