Bellampally:- (Nov 24)
ఈ రోజు బెల్లంపల్లి లో జరుగుతున్న తెలంగాణ
స్టేట్ లేవల్ ఆల్ స్టైల్స్ కుంగ్-ఫూ మరియు కరాటే ఓపెన్ చాంపియన్షిప్ పోటీలకు కీ.శే.గొంది బుచ్చన్న జ్ఞాపకార్థముగా లయన్స్ క్లబ్ ఆఫ్ సోమగూడెం అధ్యక్షుడు గొంది వెంకటరమణ గారు ఈ పోటీలకు 10,000 రూపాయలను విరాళంగా అందించారు. ఈ కార్యక్రమం నుద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఈ కరాటే పోటీలకు నా వంతుగా ఆర్థిక సహాయం చేయడం చాల సంతోషంగా ఉందని అన్నారు.
పోటిలలో పాల్గొంటున్న క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలని, గెలిచిన వారు ఉప్పొంగకుండా, ఓడిన వారు భవిష్యత్తులో గెలుపే లక్ష్యంగా కష్ట పడాలంటూ, క్రీడ స్పూర్తితో ముందుకు సాగాలని క్రీడాకారులనుద్దేశించి మాట్లాడారు. మారుమూల ప్రాంతాలలో కూడా ఇలాంటి రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు భవిష్యత్తులో మా లయన్స్ క్లబ్ నుండి ఎలాంటి సహాయసహకారాలు కావాలన్నా మేము ముందు ఉంటామని తెలిపారు.