Kasipet Mandal News:- (Nov 18)
ఈనెల 20న మంచిర్యాల జిల్లాలో జరిగే ఏపూరి
జ్ఞాన చైతన్య యాత్రను విజయవంతం చేయాల్సిందిగా జిల్లా ఇన్చార్జి తీగల శ్రీనివాస్ కోరారు. ఆదివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద చైతన్య యాత్ర వాల్ పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జ్ఞాన చైతన్య యాత్రలో భాగంగా మంచిరాల జిల్లాకు ఏపూరి రానున్నారని, చదువుకు దూరంగా ఉన్న జాతులను అక్షరం అనే ఆయుధంతో అజ్ఞానము పారద్రోలి విజ్ఞానం సంపాదించుకోవాలనే ఆశయంతో యాత్ర కొనసాగుతుందన్నారు. అట్టడుగు ప్రజలకు చదివే ఆస్తి అని మన కోసం, జాతి కోసం, పిల్లల కోసం, కుటుంబం కోసం మహనీయులైన బాబాసాహెబ్, మహాత్మ జ్యోతిబాపూలే, కొమరం భీం స్ఫూర్తిగా ఆట, పాట సాహిత్యంతో యాత్ర కొనసాగుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో స్వేరోస్ ఇంటర్నేషనల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బన్న లక్ష్మణ్ దాస్, ఫిట్ ఇండియా ఫౌండేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దుస్స కుమార్, బోర్లకుంట నవీన్, భోగే రామకృష్ణ, గోలేటి స్వామి, కుమ్మరి దీక్షిత్, గుండ అరవింద్, మహేష్, భీమేష్ తదితరులున్నారు.
Source from:- Sakshi