Kasipet Mandal News:- (Nov 22)
Kasipet మండలం గట్రావుపల్లి, సోనాపూర్
గ్రామాలలో గురువారం వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏడిఏ సురేఖ మాట్లాడుతూ రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలన్నారు. ఈ పద్ధతిలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు. ఎకరాకు తవుడు ఐదు కిలోలు, బెల్లం కిలో, మోనోఫోటోపాస్ లీటర్ నీటిలో కలిపి ఉండలుగా చేసుకొని సాయంత్రం చేనులో వెదజల్లితే మొక్కజొన్నలో కత్తెర పురుగు తోపాటు పత్తిలో లద్దెపురుగు సైతం నివారించవచ్చన్నారు. అనంతరం సేంద్రియ ఎరువుల తయారీని వివరించారు. కార్యక్రమంలో ఏవో వందన, ఏఈవోలు శ్రీధర్, తిరుపతి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Source from:- Sakshi