- శ్రమదానంతో రోడ్డు నిర్మించుకున్న పెద్దాపూర్ గిరిజనులు
Kasipet Mandal News/ Peddapur:- మారుమూల గిరిజనుల గ్రామాలను పట్టించుకునే నాథుడే లేకపోవడంతో స్థానికులు
స్పందించారు. మన ఊరును మనమే బాగు చేసుకుందామని తలంచిన పెద్దాపూర్ యువకులు గురువారం రోడ్డును అందంగా తయారు చేసుకున్నారు. Kasipet మండలం Devapur మేజర్ పంచాయతీలోని Peddapur గిరిజన కుగ్రామం. చినుకు పడితే నడక నరక ప్రాయంగా మారుతోంది. ఎన్నికలప్పుడు తప్ప ఈ గ్రామంలో ఎవరు పర్యటించారు. అలాంటి గిరిజన గూడాన్ని ౩౦ రోజుల ప్రణాళికలో ఎవరు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆవేదన చెందారు. రోడ్లు అస్తవ్యస్థ్యంగా ఉండటంతో నడవటానికి కూడా నరకప్రాయంగా ఉండేది. వార్డ్ సభ్యుడు వెడ్మ బాబు రావు ఆధ్వర్యంలో యువకులు, గ్రామస్థులు కలిసి ఇంటికి వంద రూపాయలు జమ చేసి రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. మారుమూల గ్రామాలను ఎవరు పట్టించుకోవడంలేదని యువకులు ఆవేదన వ్యక్తo చేసారు. ఊరు వాడంతా ఏకమై రోడ్డు పనులకోసం కదిలారు. దీంతో పెద్దాపూర్ రోడ్డు మెరుగయింది. యువకులు మాట్లాడుతూ ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఆశగా ఎదురు చూడవద్దని ఎవరి గ్రామాన్ని వారే బాగు చేసుకోవాలని అన్నారు . కార్యక్రమంలో రఘు, కొడప అనిల్, పేంద్రం రాందాస్, వెడ్మ తిరుపతి, ఆడే లింగు కుడిమేత విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Source from:- Andra jyothy