Kasipet Mandal News:- విద్యారంగానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. దీనిలో భాగంగా ఆదర్శ పాఠశాల, వసతి గృహ భవనాలు నిర్మిస్తున్నారు. కాంట్రాక్టర్ల అలసత్వం కారణంగా
నిర్మిస్తున్న భవనం నాసిరకంగా నిర్మిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Kasipet మండలంలోని నూతనంగా నిర్మిస్తున్న మోడల్ స్కూల్, వసతి గృహం నాసిరకమైన పనులపై న్యూస్ టుడే ప్రత్యేక కథనం...
పది కాలాలపాటు చల్లగా ఉండాలని నిర్మిస్తున్న మోడల్ స్కూల్ భవనాన్ని నాసిరకమైన పనులతో గ్రహణం పట్టింది. తెలంగాణ ప్రభుత్వం పేద విద్యార్థులకు ఆంగ్ల విద్య అందించాలని ఆలోచనతో మండలానికి ఒక మోడల్ స్కూల్ భవనాలను కేటాయిస్తున్నారు. భవనం కోసం ప్రభుత్వం ఐదు కోట్లు కేటాయించింది. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నారు. నాణ్యత పాటించకపోవడంతో అతి తక్కువ రోజులకే పగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది.
తూతూమంత్రంగా నిర్మాణం...
నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించడం లేదు. నిర్మిస్తున్న పనుల్లో దుబ్బ రకమైన ఇసుక, తక్కువగా సిమెంటు వేసి పనులు చేపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాణ్యతగా నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
నాసిరకంగా నిర్మిస్తున్నారు...
నిర్మిస్తున్న వసతిగృహం నాణ్యతగా నిర్మించడం లేదు. గత రెండేళ్లుగా నిర్మాణాలు చేపడుతున్న పనుల పూర్తి చేయడం లేదు. విద్యార్థులకు మంచి విద్య అందించాలని ప్రభుత్వం కోట్లు వెచ్చిస్తే కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నారు. సంబంధించిన అధికారులు స్పందించి నాణ్యతగా నిర్మాణాలు జరిగేలా చూడాలి.
కఠిన చర్యలు తీసుకుంటాం....
-ఏఈ వెంకటేశ్వర్లు
నాసిరకంగా నిర్మిస్తున్న గుత్తేదారు నీపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. పనుల్లో ఎలాంటి నాసిరకమైన ఇసుక వాడిన చర్యలు తీవ్రంగా ఉంటాయి. ఇకపై పనుల్లో జాగ్రత్త వహించి చేపడతాం.
Source from:- eenadu