Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

Devapur లో మండల సమావేశం ఏర్పాటు

Kasipet Mandal News/ Devapur:- 
Kasipet  మండలంలోని మేజర్ Devapur  గ్రామ పంచాయతీలో
సర్పంచ్ మడావి  తిరుమల శుక్రవారం సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామంలో జరుగుతున్న అన్ని పనుల్లో భాగంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని వార్డు సభ్యులను అడిగి తెలుసుకున్నారు. గతంలో వర్షం వస్తే రహదారులు బురదమయంగా ఉండేవని, కార్యచరణ ప్రణాళికలో భాగంగా వాహనదారులకు, పాదచారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరి చేయడం జరిగిందని అన్నారు. గ్రామస్తులు సర్పంచులకు,  అధికారులకు సహకరించి చెత్త చెదారం వేయకుండా పరిశుభ్రతను పాటించాలని కోరారు. రోడ్ల వెంట పశువులను కట్టి వేయకుండా చూడాలని, రాత్రి సమయంలో సుదూర ప్రాంతాలనుండి ఓరియంట్ వైపు వచ్చే భారీ వాహనాలకు అడ్డుగా పశువులు ఉంటున్నాయని,  పశువుల యజమానులు వారి ఇండ్లలో కట్టేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

Source from:- Andhra prabha.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App