Kasipet Mandal News/ Devapur news:-(13 october)
ఓరియంట్ సిమెంట్ కంపెనీ కార్మికుల సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని గుర్తింపు సంఘం ఎన్నికలలో
విమానం గుర్తుకు ఓటు వేసి రామ్మోహన్ రావు ను గెలిపించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు తెలిపారు. శనివారం Kasipet మండలంలోని Devapur లో కంపెనీ ఆవరణలో ఈ నెల 15న జరుగనున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కంపెనీ హెచ్ ఆర్ డిపార్ట్మెంట్ ను హైదరాబాద్ నుండి దేవాపూర్ కు తీసుకు వస్తామని, వైద్యసేవలు మెరుగు పరచడంతో పాటు స్థానిక గ్రామాల అభివృద్ధి చేపట్టనున్నట్లు తెలిపారు. నాలుగో ప్లాంట్ విస్తరణలో స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఎక్కడి సమస్యలు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామన్నారు. కార్మికులకు సేవ చేసేందుకు ఫిలిం డిపార్ట్మెంట్ సొసైటీ అధ్యక్షుడు రామ్మోహన్ రావు పోటీ చేయడం కార్మికులు అదృష్టంగా భావించి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి అన్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకే ఓటు వేయాలని సూచించారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి, జడ్పిటిసి చంద్రయ్య, నాయకులు తిరుపతిరెడ్డి, రోడ్డ రమేష్, గడ్డం పురుషోత్తం, మడావి అనంతరావు, మండల ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు, కార్మికులు తదితరులు ఉన్నారు.
- Source from sakshi news