News info @kasipet:-
దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన పథకం కింద
ఇంగ్లీష్ రీడ్ లైన్స్ కంప్యూటర్ కోర్స్ ట్రైనింగ్ సెంటర్ వారు మంచిర్యాలలో ఉచిత శిక్షణ అందిస్తున్నారు. 19 - 26 లోపు వయస్సు గల యువకులు పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ ఏదైనా పూర్తి చేసిన వారు అర్హులు. మొత్తం 90 రోజుల ఉచిత శిక్షణ ఉంటుంది. ఇందులో 75 రోజులు మంచిర్యాల జిల్లా కేంద్రంలో, 15 రోజులు హైదరాబాద్ లో శిక్షణ అందిస్తారు. శిక్షణ తర్వాత హైదరాబాద్ లోని డీమార్ట్, స్పెన్సర్స్, రిలయన్స్, సామ్ సంగ్, హెరిటేజ్, మెక్ డోనాల్డ్ తదితర సంస్థల్లో ఉపాధి కల్పిస్తారు. వేతనం 9,000 నుండి 11,000 రూపాయల వరకు ఉంటుంది. ఈరోజు నుండి జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న డీ.డబ్ల్యు.సి.ఆర్.ఏ భవన్ లో తెల్ల రేషన్ కార్డు, ఆహారభద్రత కార్డు, పదోతరగతి మెమో, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ తీసుకువెళ్లి తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. శిక్షణ సమయంలో ఉచిత భోజనం, వసతి, యూనిఫామ్, షూ, నెలకు 1,000 రూపాయల చొప్పున మూడు నెలల ఇస్తారు. కాసిపేట మండలంలోని యువకులు సద్వినియోగం చేసుకోండి.