Kasipet Mandal News:- (oct 21) సోమగూడెం నుండి బెల్లంపల్లి వైపునకు వెళ్లే అంతర్ రాష్ట్ర రహదారిపై పలుచోట్ల
గుంతలు ఏర్పడ్డాయి. పెద్దనపల్లి గ్రామానికి వెళ్లే రహదారిపై ఏర్పడిన గుంతలు అత్యంత ప్రమాదకరంగా మారాయి. దిగువ ప్రాంతంలో ఉండటంతో వేగంగా వచ్చే వాహనాలు గమనించగా గుంతలో పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. మండలంలోని సోమగూడెం నుండి యాపకు వెళ్లే రహదారిలో భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఇప్పటికే పలు ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. సంబంధిత ఆర్.అండ్.బి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతలను పూడ్చాలని వాహనదారులు కోరుతున్నారు.
Source from :- eenadu news