Kasipet Mandal News:-
Kasipet తహసిల్దార్ కార్యాలయంలో పెద్దనపల్లి భూరికార్డుల మాయం విషయంలో బుధవారం ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు
తరలించారు. ఈ సందర్భంగా కాసిపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మందమర్రి సీఐ మహేష్ వివరాలు వెల్లడించారు. ఆగస్టు 11న కార్యాలయంలో భూరికార్డుల మాయం అయినట్లు తహసిల్దార్ ప్రసాద్ వర్మ ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. భూరికార్డుల కు సంబంధించి రూమ్ కీపర్ లాగా ఉన్న విఆర్ఏలు సతీష్, స్వామి, మల్లయ్యలపై అనుమానాలు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు kasipet ఎస్సై భాస్కర్ రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు. తహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న విఆర్ఏ సత్తయ్య హస్తం ఉందని, మిగతా విఆర్ఏలు స్వామి, మల్లయ్య కు సంబంధం లేదని విచారణలో తేలిందన్నారు. వీఆర్ఏ సత్తయ్య భూరికార్డులను కార్యాలయం నుండి తీసి ముత్యంపల్లికి చెందిన బోయిని అంకులు, కాసిపేట కు చెందిన అట్టెం సూర్యనారాయణకు పహాని లను అప్పగించరని, వీరు ముగ్గురు కలిసి స్థానిక రైతులు గుడిసెల వెంకటస్వామి, గుడిసెల కృష్ణ, జలం పెల్లి శ్రీనివాస్, జిల్లెల దేవయ్య, మైలారపు లక్ష్మి, ఇప్ప బాపు, గొర్లపల్లి రామకృష్ణల నుండి రూ. 1.55 లక్షలు తీసుకొని, పేర్లను పహాని లో ఎక్కించడానికి ప్రయత్నించారని. ఈ మేరకు దొంగతనానికి గురైన రికార్డులు స్వాధీనం చేసుకొని ముగ్గురిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో కాసిపేట, దేవాపూర్ ఎస్సైలు భాస్కర్ రావు, దేవయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
Source from:- sakshi news