Kasipet Mandal News/ Muthyampally:- (oct 26)
Kasipet మండలం ముత్యంపల్లి గ్రామంలోని 5వ వార్డు ప్రజలు గ్రామ
పంచాయతీ ఆఫీస్ లో సర్పంచ్ బాదు గారిని మరియు పంచాయతీ కార్యదర్శి ఇసాక్ గారిని కలిసి తమ ఇల్ల పక్కన పెద్ద పెద్ద చెట్లతో కూడిన ముళ్లపొదల్లు, పిచ్చి మొక్కలు ఉన్నాయని వాటి నుంచి విష పురుగలు ఇళ్లల్లో చేరి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని, పెద్ద ఎత్తున చెట్ల పొదల్లో నీళ్లు చేరి దోమలు ఎక్కువగా ఇళ్లల్లోకి వస్తున్నాయని ఇప్పటికే ఆ చుట్టుపక్కల వారికి ఇంటికి ఒకరు,ఇద్దరు చొప్పున డెంగు వ్యాధి వ్యాపించి హాస్పిటల్స్ చుట్టూ తిరిగి ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అలాగే దగ్గరలో మోడల్ స్కూల్, కస్తూరిబా బాలికల పాఠశాల, గవర్నమెంట్ కాలేజ్ ఉన్నాయని అందులోని విద్యార్థులు కూడా ఎటువంటి రోగాల బారిన పడకుండా చూడాలని, ఈ సమస్యలను త్వరగా పరిష్కరించాలని పుర్ర కుమారస్వామి యాదవ్ గారి ఆధ్వర్యంలో మహిళలు, యువకులు వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్స్ మేడి రజిత-శ్రీనివాస్,మంద వెంకటేష్,మల్లెత్తుల సందీప్ మరియు కుంభం సతీష్, బోయిని జగ్గన్న,చొప్పరి సతీష్,గడ్డం సంతోష్,రాజేందర్ పెద్ద ఎత్తున మహిళలు యువకులు పాల్గొన్నారు.