Kasipet Mandal News/ గట్రావుపల్లి:-
ఓరియంట్ సిమెంట్ కంపెనీలో kasipet మండలం
గట్రావుపల్లి పంచాయతీలోని గిరిజనులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఓరియంట్ సిమెంట్ కంపెనీ అధ్యక్షుడు ఎస్.కె పాండే అన్నారు. సోమవారం గట్రావుపల్లి పంచాయతీలోని ఏడూ గిరిజన గూడాల ప్రతినిధులతో కంపెనీ అధ్యక్షుడు ఎస్.కె పాండే ఏసీపీ బాలు జాదవ్ ఆధ్వర్యంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కంపెనీ అధ్యక్షుడు పాండే మాట్లాడుతూ అర్హులైన అందరికీ ఓరియంట్ సిమెంట్ కంపెనీ లో మూడు వందల మందికి 4వ ప్లాంట్ లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. అప్పటి వరకు 100 మంది యువకులను తాత్కాలిక ఉద్యోగుల కింద తీసుకొని ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆత్రం జంగు, గణపతి, ఆత్రం లింగు, జైతు, ప్రభాకర్, భీంరావు, అర్జు, దేవాపూర్ ఎస్ఐ దేవయ్య పాల్గొన్నారు.