- ఓరియంట్ సిమెంట్ గుర్తింపు సంఘం ఎన్నికలు నేడే
- ఓటు హక్కు వినియోగించుకున్న 275 మంది కార్మికులు
- ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
- ఇద్దరి మధ్యే ప్రధాన పోటీ
Kasipet Mandal News/ Devapur :- (october 15)
Kasipet మండలంలోని Devapur ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికలు మంగళవారం జరుగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించి కార్మిక శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ ఎన్నికలను నాలుగు ఏళ్ళు దాటిన తర్వాత ఇప్పుడు జరుపుతున్నారు. మొత్తం 298 ఓట్లకు గాను ప్రస్తుతం 23 మంది కార్మికులు లేరు. దీంతో ప్రస్తుతం 275 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి అరగంట విరామం అనంతరం తిరిగి 4:30 గంటలకు కౌంటింగ్ ప్రారంభించనున్నారు. ఎన్నికలలో నాలుగు యూనియన్లు బరిలో ఉన్నప్పటికీ ఇద్దరు అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. టిఆర్ఎస్ బలపరిచిన ఫిలిం డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ రామ్మోహన్ రావు యూనియన్ తరపున పోటీ చేస్తున్నాడు. స్వతంత్రులుగా నామినేషన్ వేసి రెండు రోజుల కిందట బిజెపి మద్దతు పొందిన అభ్యర్థి సతీష్ రెడ్డి పోటీ చేస్తుండగా వీరిమధ్య పోటీ నెలకొంది. ప్రస్తుతం గుర్తింపు సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్న రాములునాయక్ బరిలో నిలిచిన అనుకున్న స్థాయిలో ప్రచారం నిర్వహించలేదు. ఆర్భాటాలు ప్రజాప్రతినిధుల అండతో టీఆర్ఎస్ అభ్యర్థులు కార్మికులను తమ వైపు తిప్పుకుంటుండగా స్వయానా కార్మికుడు అయినా సతీష్ రెడ్డి అంతర్గతంగా సహచరుల మద్దతు కోరుతూ ముందుకు సాగుతున్నాడు.
Source from :- Sakshi news