Kasipet Mandal News:- (14th October )
తమ న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు విద్యార్థి జేఏసీ సంపూర్ణ మద్దతు ఉంటుందని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. ఆదివారం kasipet మండలంలోని
సోమగూడెం లో విలేకరులతో మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా సమస్యలు పరిష్కరించాలని సమ్మెకు దిగితే వారితో చర్చించి సమస్యలు పరిష్కరించాల్సింది పోయి ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని మరింత రెచ్చగొడుతూ మానసికంగా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందన్నారు. కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రభుత్వమే కారణమని, సెప్టెంబర్ వేతనాలు ఇవ్వమని చెప్పడం కెసిఆర్ నియంత పోకడలకు నిదర్శనమన్నారు. మరోపక్క విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతూ సెలవులు పెంచడం సిగ్గుచేటని, విద్యార్థుల సిలబస్ ఒకేసారి బోధించడం తో వారు ఇబ్బందులకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. వెంటనే సమస్యలు పరిష్కరించి సెలవులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే విద్యార్థి, యువజన సంఘాలు, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో కలిసి ఆందోళనలు ఉద్ధృతం చేయనున్నట్లు హెచ్చరించారు. బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లి సాగర్, ఏ.ఐ.ఎఫ్.డి.ఎస్ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్ర ప్రసాద్, టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు నాయిని మురళి శ్రవణ్, ఏ.ఐ.ఎఫ్.డి.వై జిల్లా కార్యదర్శి పసులేటి వెంకటేష్, ఎన్.ఎస్.యు.ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి అన్వర్, ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు సాహిత్ కుమార్, సాయి ప్రసన్న తదితరులు ఉన్నారు.